Tuesday, 1 March 2016

శ్రీమద్ భగవత్గీతలో ఏ శ్లోఖం కూడా మనుష్యులను

శ్రీమద్ భగవత్గీతలో ఏ శ్లోఖం కూడా మనుష్యులను దురం చేస్తూ కులాలను సృష్టించలేదు,
భగవత్గీత ఇప్పుడు మనం అనుసరిస్తున్న పుస్తకాలు లక్షల్లో వచ్చిన శ్రీమద్ భగవత్గీత యొక్క న్యాయపరమైన చట్టాలకు సాటిరావు
బ్రాహ్మణ - దైవానికి మార్గం - దేవ
క్షత్రియ - రక్షణకు మార్గం - మనుష్య
వైశ్య - ఆహారానికి మార్గం - తిర్యక్
శుద్ర - శ్రమధననికి మార్గం - స్థావరాల
ఇలా శ్రీమద్ భగవత్గీత ఇలా నాలుగు వర్ణాలు ఉన్నాయి, ఈ వర్ణాలు ఇలా చూస్తే ఎవ్వరికీ అర్ధం కావు అందుకే మీకు అర్దం అయ్యే రీతిలో మీకు తెలియజేయ్యటానికి నావంతుగా
ప్రయత్నిస్తాను
👉 బ్రాహ్మణ - దైవానికి మార్గం, దేవుణ్ణి కోసం తెలియని వెక్తులకు దైవప్రితి కోసం తెలియజేస్తూ దేవుడిని ఆరాధిస్తారు
👉 క్షత్రియ - రక్షణకు మార్గం, దేససంరక్షణ కోసం అనునిత్యం పాటుపడుతు దేశన్ని దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తూఉంటారు
👉 వైశ్య - ఆహారానికి మార్గం, (భుక్తి) దైవసేవకుల్ని, దేశ రక్షాకుల్ని, శ్రమధనకుల్ని వాల్లతోకలుపుకొని అందరికోసం పంటల్ని పండిస్తూ ఆహార ఉత్పతి చెయ్యాలి
👉 శుద్ర - శ్రమధననికి మార్గం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు సహాయసహకారాలు అందిస్తూ దేశప్రగతికి ముఖ్యకార్యకర్తలుగా ఉండటం
మిత్రులారా పైన ఉన్న నాలుగు వర్ణాలలో ఎక్కడ ఒక కులంకోసం ప్రస్థావన లేదు, దళిత, మత్ష, మంగలి, చాకలి, వడ్ర, రెడ్డి, కాపు, కమ్మ, బలిజ కుమ్మరి, బాప్పన అనే ఏ ఒక్క కులానికి అవకాసం ఇవ్వలేదు ఇప్పుడు, శుద్ర అంటే ఏమి తెలియదు అందుకు వాళ్ళు జ్ఞానం కోసం ఏదో ఒక వర్ణం ఎంచుకొని ఆ వర్ణంలో అనుబవం సంపాదించి ఈరోజు ఉన్న శుద్రడు రేపటికి వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ ఏ వర్ణంలోనైన చేరవచ్చు, అందుకు కారణం
పుట్టిన ప్రతిబిడ్డకు వెంటనే ఉన్నతస్థాయి విద్యాలయంలో పరిక్షలు వ్రాయమంటే వ్రాయగలడ..??
అందుకే ముందు 1,2,3 అంటూ తరగతులకు మారుతూ గమ్యానికి చేర్వవ్వుతారు
అలానే శుద్ర వర్ణంలో ఉన్న జీవుడు వాళ్ళుకు నచ్చిన మార్గానికి ఎంచుకొని అందులో అనుబవం స్వీకరించి ఆ వర్ణంలో సంతోషంగా జీవించవచ్చు కానీ నేడు కొంత మంది కంపు కమూనిస్ట్ గళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ దేశంలో కుల వేవస్థ సృష్టించి మన దేశ ఐఖ్యత బంగం చెయ్యాలని చూస్తుంది, అందుకే భగవత్గీత లో ఉన్న శ్లోఖలకు అర్దపర్ధాలు మర్చి తప్పుడు ప్రచారం చేస్తుంది ఇంతకు ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా విద్యాలయాలకు వెళ్లి విధ్యాబ్యాసం చేసారా ..?? నాకు తెలిసినంత వరకు చదువు సంధ్యలు భుద్ధి జ్ఞానం, అంతకులంత చివరకు కమ్యూనిస్ట్ లో చేరుతున్నారు. మిత్రులారా ఒక్క సరి హిందూత్వంలో ఉన్న ప్రతి శ్లోఖనికి అర్దం తెలుసుకోండి హిందూత్వంలో శ్రీమద్ భగవత్గీత ఏనాడూ మనలో మనకు ఒక్కోవిధముగా చూడలేదు కులం పేరు లేకుంట మనం అందరం శ్రీమద్ భగవత్గీత మహాగ్రంధం చెప్పినట్లు దేశ సంరక్షణ కొరకు ఐక్యంగా ముందుకు సాగుదాం మీకు మిరే మా నుండి దురం అవ్తున్నారు మిత్రమా ఈ దేశంలో అందరం సమానం మీరు మేము అనే బావన నుండి మనం మన దేశం అనే సంకల్పంతో ముందుకు రండి ఈ దేశం మన అందరిది ప్రతి ఒక్కరికి శిక్షణ అవసరం ఉంటుంది ఆ శిక్షణలోనే ఇంకా ఉండిపోవద్దు
మీ అనుబవంతో మన దేశాన్ని ముందుకు తీసుకువెల్దం .. ఇట్లు మీ ఇంటి బిడ్డ సాయి విశ్వతేజ

"అమ్మ" కోసం

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి "అమ్మ" కోసం అత్భుత ఉపదేశం అన్యమతస్థులు ఈ మద్దిన్న హిందుత్వాన్ని ద్వేసిస్తూ ఎవ్వరికీ ఇష్టం వచ్చిన తీరులో వాళ్ళు విమర్శిస్తున్నారు 
హిందూత్వంలో మహిళలకు విలువ లేదు అంటూ కానీ అల అంటున్న వాళ్ళంతా అద్దం చూసుకొని మాట్లాడుత్నున్నారు అని నాకు అర్ధం అవ్తుంది వాళ్ళ మతంలో జరుగుతున్న ధరునల్ని మనమేద హృద్దుతున్నారు వాస్తవానికి ప్రపంచంలో మరే ధర్మంలో లేని మహిళా మత్రుముర్తులకు ఉన్న విలువలు మన హిందూత్వంలో తరతరాలుగా ఇమిడి ఉన్నాయి దేహమత , దేశమత , గోమాత.విధ్యమత , వైధ్యమత ,మాతృదేవోబావః
ఇలా మన జీవితంలో జరుగుతున్న ప్రతి మంచి విషయాన్నీ "అమ్మతోనే" పోల్చుకుంటాము
ఎవ్వరికైనా దమ్ము ఉందా..?

ప్రతిరోజులా ఈరోజు కూడా సూర్యచంద్రులు వస్తారు

ప్రతిరోజులా ఈరోజు కూడా సూర్యచంద్రులు వస్తారు   ఈ నాలుగేలలో ఈ ఒక్కరోజు కేవలం ఆంగ్లతేదీలకు ప్రత్యేకం, వాస్తవానికి భారతీయ సంప్రదాయాలతో ఉద్భవించిన తేదిలలో సంపూర్ణంగా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:
శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
చైత్రము, వైశాఖము,జ్యేష్ఠము,ఆషాఢము,శ్రావణము,భాద్రపదము,ఆశ్వయుజము
కార్తీకము,మార్గశిరమ,పుష్యము,మాఘము,ఫాల్గుణము
నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.
నెలల పేర్లని చైత్రం మొదలుగా ఫాల్గుణం దాకా చెప్పుకుంటున్నాం. కాని ఒకప్పుడు వేదం లో చెప్పిన నెలల పేర్లు ఇలా ఉన్నాయి,చిత్తగించండి.
చైత్ర–వైశాఖం–మధు–మాధవ మాసాలు- వసంత ఋతువు.
జ్యేష్టం–ఆషాఢం–శుక్రం–శుచి మాసాలు-గ్రీష్మ ఋతువు.
శ్రావణం–భాద్రపదాలు–నభం–నభస్యం-వర్ష ఋతువు.
ఆశ్వయుజం–కార్తీకం మాసాలు–ఇషం–ఊర్జం-శరదృతువు.
మార్గశిరం–పుష్య మాసాలు–సహం–సహస్యం–హేమంత ఋతువు.
మాఘం–ఫల్గుణ మాసాలు–తపం–తపస్యం–శిశిర ఋతువు.
వేదంలో చెప్పబడిన నెలల పేర్లు, ఆ నెలలలో ప్రకృతి మార్పులనే సూచిస్తున్నాయి, నెలల పేరు కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది.
మధు,మాధవ మాసాలు వసంతం, పువ్వులు పూస్తాయి, చెట్లు చిగుర్చుతాయి, తేనె బాగా దొరికే కాలం.
శుక్రం,శుచి మాసాలు గ్రీష్మ ఋతువు వెలుగు ఎక్కువగా ఉండేకాలం.
నభం,నభస్యం వర్ష ఋతువు, అనగా మేఘం,వర్షం సూచన చేస్తున్నాయి నెలల పేర్లు.
ఇషం,ఊర్జం శరత్ ఋతువు బలం సూచిస్తున్నాయి.
సహం,సహస్యం హేమంత ఋతువు, చలి సహించక తప్పదని సూచిస్తున్నట్టే ఉంది.
తపం,తపస్యం శిశిర ఋతువు, ఈ ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేసి కొత్త చిగురు కోసం తపిస్తున్నట్టు ఉంటాయి.
ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తెనుగు నెలల పేర్లు ఎలా వచ్చాయి?
చిత్తా నక్షత్రంతో కూడిన పున్నమి కలిగిన మాసం, చైత్రమాసం .
విశాఖ నక్షత్రం తో కూడిన పున్నమి కలిగినమాసం వైశాఖం.
జ్యేష్ట నక్షత్రంతో కూడిన పున్నమి కలమాసం జ్యేష్ట మాసం.
పూర్వాషాఢ, ఉత్తరాషఢ నక్షత్రాలతో కూడిన పున్నమి కల మాసం ఆషాఢ మాసం.
శ్రవణం నక్షత్రంతో కూడిన పున్నమి కలిగే మాసం శ్రావణమాసం.
పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర నక్షత్రాలు కలిగి ఉండే పున్నమి కలమాసం భాద్రపద మాసం.
అశ్వనీ నక్షత్రం తో కూడి ఉండే పున్నమిగల మాసం ఆశ్వయుజ మాసం.
కృత్తికా నక్షత్రంతో కలిగి ఉండే పున్నమి కలమాసం కార్తీక మాసం.
మృగశీర్షా నక్షత్రంతో కూడి ఉండే పున్నమిగల మాసం మార్గశీర్ష మాసం.
పుష్యమీ నక్షత్రంతో కూడిన పున్నమి కలిగే మాసం పుష్య మాసం.
మఘ నక్షత్రంతో కూడి కలిగే పున్నమి కలమాసం మాఘమాసం,
ఉత్తర నక్షత్రంతో కూడి ఉండే పున్నమి కలమాసం ఫాల్గుణ మాసం.
అంటే మన హిందూ సంప్రదాయ ప్రకారం ఈరోజు ప్రతి సంవత్సరం వస్తుంది అంతే కానీ ఆంగ్ల తేదిల మదిరగా నాలుగు నెలలకు వచ్చేది కాదు
అందుకే పెద్దలు చెప్తారు "విదేశీ సంస్కృతి మనకు వద్దు మన సంప్రదాయ సంస్కృతి మనకు ముద్దు అని smile emoticon

కర్నూలు జిల్లా యాగంటిలో ఉన్న నంది విగ్రహం






కర్నూలు జిల్లా యాగంటిలో ఉన్న నంది విగ్రహం 
ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున పెరుగుతున్నది.

మీకు తెలుసా.........గాలిలో వేలాడే స్థంభం ఒకటుందని



మీకు తెలుసా.........గాలిలో వేలాడే స్థంభం ఒకటుందని ,
ఎంతో మంది ఇంజనీర్లు ఈ ఆలయ స్తంభపు మిస్టరీని చేధించలేక 
“ మిస్టీరియస్ టెంపుల్ “ అని పిలిచారనే సంగతి . తెలియని వారికోసం నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ :
“ లేపాక్షి టెంపుల్ “ అని పిలవబడే ఈ వీరభద్ర ఆలయం 
అనంతపురం జిల్లాలో ఉంది.
16 వ శతాబ్దంలో విరూపన్న, వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన 
ఈ ఆలయంలో ఒక స్థంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు.
గాలిలో వేలాడుతున్నట్లుగా ఉండే ఈ స్థంభం కింది నుంచి ఒక సన్నని క్లాత్ ను ఒక వైపు ఇంకో వైపుకు తీయొచ్చు.
ఈ ఆలయానికున్న మరో చరిత్ర ఏమిటంటే..........,
రావణుని చేతిలో గాయపడిన జటాయువు అనే పక్షి ఈ ప్రాంతంలో పడగానే , శ్రీరాముడు ఆ పక్షిని చూసి “ లే పక్షి “ అని పిలిచారట.
అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది.

కర్మ సిద్ధాంతం ? ..

కర్మ సిద్ధాంతం ? ..
కర్మ సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. కానీ.. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. 
మరికొందరికి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాల్సినది జరగక మానదు అనేది ప్రధాన ఉద్ధేశ్యం.
అలాగే జరగాలి అని రాసి ఉన్న దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. జరిగేది ఆపలేరు. జరగనిది మన ప్రయత్నం చేసినా జరగదని అర్థం.
కర్మ ఎలా వచ్చింది జీవితం కేవలం తనంతట తాను జరగదు. మన పాత్ర ఉంటేనే జీవితం ముందుకు సాగుతుంది. ఈ విశ్వంలో మనం ఒక భాగం.
కాబట్టి చుట్టు ఉన్నవాళ్లతో పోల్చుకోకుండా.. మీకు నచ్చినట్టు మీరు ఉండాలి.
ఏ విషయంలోనైనా ప్రతిఫలం పొందాలంటే.. నిరంతర కృషి అవసరం. నిరంతర కృషితో పాటు ఓర్పు చాలా అవసరం.
తాము చేయాల్సిన పని చేస్తున్నప్పుడు తప్పకుండా సంతోషం కలుగుతుంది. అలాగే.. తమకు ప్రతిఫలం
ఎప్పుడొస్తుందో కూడా వాళ్లు చేసే పనిని బట్టి అర్థమవుతుంది.
ఒకే ఒక్క సిద్ధాంతం సృష్టిలో మొత్తానికి ఉన్నది కేవలం ఒక్కగానొక్క సిద్ధాంతమే. అదే కర్మ సిద్ధాంతం.
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అంటారు. మన భావనలే మన యదార్ధాలవుతాయని వివరించేదే కర్మ సిద్ధాంతం.
కాబట్టి మన ప్రవర్తన బావున్నప్పుడే, మన ఆలోచనలు బావున్నప్పుడే మనం కోరుకున్న జీవితం మనకు దక్కుతుంది....

నాగసాదువులు-నానో టెక్నాలజీ


నాగసాదువులు-నానో టెక్నాలజీ
ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే....
మన ఋషులు,యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు.
మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశం గుర్తుంది కదా. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు ,మాన సంరక్షణ కోసం తను శ్రీ కృష్ణుడిని ప్రార్ధిస్తుంది. ఎక్కడో ద్వారకలో వున్న కృష్ణుడు తక్షణం అక్కడ ప్రత్యక్షమై ద్రౌపది శీలాన్ని కాపాడుతాడు. దానికి ఆటను ఎంచుకున్న ప్రయాణ సాధనం నానో టేక్నాలజీయే. త్రిలోక సంచారి ఐన నారదుడు నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించే వాడు. ఇదంతా చదివి సాదిక్ భాయ్ కి మతి భ్రమించి రాస్తున్నాడు, అని మిత్రులు భ్రమపడే అవకాశం వుంది. అందుకే ,ఇక్కడ ఒక సజీవ ఉదాహరణ ఇస్తున్నాను.
హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళా లు గుర్తున్నాయి కదా. అక్కడికి లక్షలాది మంది నాగసాదువులు రావటం మనం టీవీల్లో,పేపర్ లలో చూశాం. నాగసాదువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో,నదీ తీరాల్లో వుంటారు.మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి.
ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ,వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా,ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో ,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?లేదే? సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?
వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం .అదే నానో టెక్నాలజీ.నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం.ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు,జర్మనీ వాడు చెప్పే సొల్లు అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి,అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.

Popular Posts

Top Sites

Pages

Total Pageviews

Search This Blog